ముదిరాజ్ ల ఆహ్వానం మేరకు శ్రీశైలం లోని ముదిరాజ్ అన్నదాన సత్రానికి ఆంధ్రప్రదేశ్ పశు సంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ మంత్రి వర్యులు సీదిరి అప్పలరాజు, రాజ్య సభ సభ్యులు మోపిదేవి వెంకట రమణ సందర్శించి ఇక్కడ భక్తులకు అందించే సేవల గురించి తెలుసుకొని హర్షం వ్యక్తం చేసారు.
ఈ కార్యక్రమంలో సత్రం అధ్యక్షులు రోటం భూపతి మాటాడుతూ రెండు తెలుగు రాష్టాల్లో ఇంత పెద్ద సత్రం ఇదొక్కటేనన్నారు, మాకులస్తులు జనాభా సంఖ్య పరంగా చాలా ఎక్కువగా ఉన్నామని, ఆర్థికంగా రాజకీయంగా చాలా వెనుకబడి ఉన్నారని, వారికి ముదిరాజ్ కార్పొరేషన్ ఒక్కటే కాకుండా, ఫిషరీస్ కార్పొరేషన్ ద్వారా విరివిగా రుణాలు ఇప్పించి,వారికి కావాలిసిన పరికరాలు అందించి వారిని ఆదుకోవాలని తెలియచేసారు.
అనంతరం ముదిరాజ్ సత్రం అధ్యక్షులు రోటం భూపతి, చైర్మన్ గువ్వల గంగాధర్, వ్యవస్థాపకులు మాడెబోయిన గోపయ్య, పోతురాజు పెద్ద వెంకటేశ్వర్లు కమిటీ సభ్యులు, ముదిరాజ్ కులస్తులు కలిసి ముదిరాజ్ లను BC-D నుండి BC-A లోకి మార్చమని వినతిపత్రం అందించారు, మంత్రి గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి BC-A లోకి మార్చటానికి సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఈ అన్నదాన సత్రం ఇంకా బలోపేతం చేయటానికి కావలసిన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు . అనంతరం కమిటీ సభ్యులు మంత్రి గారిని ఎంపీ గారిని ఘనంగా సన్మానం చేసారు.
إرسال تعليق