Telangana Robbin Hood Panduga Sayyanna Mudiraj History | Every One Must Read


ఉన్నోల్లని కొట్టిండు, లేనోల్లతు పెట్టిండు, 
పండుగ సాయన్న వాడు.
రాజులకు మొనగాడు.

ఆయన సంపదకలిగిన
ధనవంతులను, భూస్వా ములను, పెత్తందార్లను
గడగడలాడించిండు. అన్యాయంగా, దౌర్జన్యంగా వాల్లు సంపా యించిన సొత్తునంతా లాక్కున్నాడు, దోచుకున్నడు. అదంతా తిండిలేని పేదోళ్లందరికి పంచిండు. వాల్లకు కడుపునిండా తిండి పెట్టిండు. ఆయన బ్రతికిఉన్నతకాలం పేదోళ్లందరికీ దేవునిలా సహాయం చేసిండు.

ఎవరు ఆయన?
ఆయన మన తెనుగోల్ల సాయన్న...
ఆయనే పాలమూరు పండుగ సాయన్న....

పండుగ సాయన్న పాలమూరు (మహబూబ్ నగర్) జిల్లా మేరుగోనిపల్లె అనే గ్రామంలోని ఒక నిరుపేద తెనుగు కుటుం బంలో"మొహర్రం" పండుగ రోజున జన్మించాడు. వంద ఏళ్ల క్రితం తెనుగోల్లు తోటపనులు చేయటం, తోటలు పెంచడం, రకరకాల పండ్లు అమ్మటం వంటి పనులే ఆధారంగా జీవించేవారు. అత్యంత పేద కుటుంబంలో జన్మించిన సాయన్న పాఠశాల విద్యకు నోచు కోలేదు. కుటుంబ సభ్యులతో తోట పనుల్లో నిమగ్నమై చిన్న నాటి నుండి కటిక పేదరికం అనుభవించాడు. బాల్యం నుండే సాయన్న తన ఇరుగు పొరుగు వాళ్లు పేదరికం వల్ల అనుభవిస్తున్న బాదలను గమనించాడు. వాటిన్నింటిని అర్ధం చేసుకున్నాడు. పేదల సంక్షేమం కోసం పనిచేయాలని నిర్ణయించుకున్నాడు తన వయస్సున్న యువకులందరినీ సమీకరించాడు. అప్పట్లో వాడుకలో ఉన్న "సాము గదిడె" అని పిలువబడే కర్రె సాము నేర్చుకున్నాడు. తద్వారా శారీరక వ్యాయామాలను అభ్యసించాడు. పేదోల్ల సంపదనంతా దోచుకుతిన్న భూస్వాములను, పెత్తందారులను ఎదిరించాడు. పటేండ్ల సొమ్ములాక్కుని పేదలకు పంచాడు.

తన స్నేహితులతో "ముఠా"ను ఏర్పాటు చేసి, ఆ ముఠాకు తాను నాయకత్వం వహించాడు. ఆరడుగుల ఎత్తు, విశాలమైన శరీరం, గుబురు మీసాలతో సాయన్న వీరునిగా ఎదిగి సాహస పోరాటాన్ని ప్రారంభించాడు. పేదోళ్ల శ్రమను దోచుకుని అక్రమంగా సంపాదించిన భూస్వాములను ఎదిరించాడు. భూస్వాముల సంపదను పేదోల్లకు పంచాడు. ప్రజల్లో పేదరికాన్ని సంపూర్ణంగా నిర్మూలించాలని సాయన్న తన ముఠాతో కలిసి గ్రామగ్రామాన ప్రచారం చేశాడు. ఆనాడు సాయన్న చేసిన సహాయాన్ని ప్రజలు కీర్తించారు. 

పేదలంతా సాయన్నను దైవంగా భావించారు. ఆయనను ఎంతో గౌరవించారు. పాలమూరు జిల్లాలోని అనేక గ్రామాల్లో సాయన్న నిర్వహించిన సాహసోపేత కార్యక్రమాలను పేద ప్రజలంతా కీర్తించారు. మొహర్రం పండుగ రోజున జన్మించిన సాయన్న ప్రతీ ఏడాది మొహర్రం పండుగ నాడు "కందూర్లు" నిర్వహించి పేదోళ్లందరికీ కడుపునిండా భోజనం పెట్టించేవాడు. పెత్తందార్ల దౌర్జన్యాలను ఎదిరించి దైర్యంగా నిలబడిన రోజునే పేద ప్రజలు అన్నివిధాలుగా బాగుపడుతారని సాయన్న ఉద్దరించాడు. సాయన్న పట్ల ప్రజల్లో పెరుగుతున్న అభిమానాన్ని, గౌరవాన్ని పెత్తందార్లు. పటేండ్లు, భూస్వాములు భరించలేకపోయారు. అలనాటి గోల్కొండ నిజాము నవాబుకు పిర్యాదు చేశారు. సాయన్నను, ఆయన ముఠాను వెంటనే నిరదించాలని నిజాము నవాబు ఆదేశాలు జారీచేశాడు. సాయన్నను బందించడానికి పోలీసులు, రహస్య గూఢాచారులు రంగంలోకి దిగారు. వాళ్లెవ్వరికీ దొరకకుండా సాయన్న గ్రామగ్రా మాన, ఇరుకు సందుల్లో, పూరి గుడిసెల్లో తిరుగుతూ ప్రజలను కలిసేవాడు. వారిలో ఎదురించే ధైర్యాన్ని నింపేవాడు. తోటల్లో, పంట చేన్లల్లో వాగుల్లో, పంపుల్లో, కొండల్లో, కోనల్లో, అడవుల్లో, ఇసుకబాటల్లో తిరుగుతూ సాయన్న తన ఉద్యమాన్ని నిర్వహించాడు. ఆనాటి పాలకులు 'దండుగ' లోపేరిట, రకరకాల పన్నుల పేరిట చేసిన దోపిడీలను అరికట్టడానికి సాయన్న ప్రయత్నించాడు.

భూస్వాములు, ధనవంతులంతా కలిసి సాయన్నను పట్టు కోవడానికి అన్ని ప్రయత్నాలు, కుట్రలు, కుతంత్రాలు చేశారు. చివరికి ఆయనను నిరిదించారు. ఇనుప గొలుసులతో బందించారు. ఈ వార్త తెలుసుకున్న పద్నాలుగు గ్రామాల ప్రజలు ఆందోళనలు చేపట్టారు. భూస్వాములు ఇళ్లముందు, పోలీసు స్టేషన్ల వద్ద నిరసనలు చేశారు. అరుస్తూ, ఏడుస్తూ నినదించారు. నిజాం నిరంకుశ పాలనా కాలంలోనే ప్రజలంతా చైతన్యవంతులై సాయన్నను రక్షించుకోవ టానికి అన్ని విధాల ప్రయత్నించారు.

ఇనుప గొలుసుల సంకెళ్లలో బందించిన సాయన్న దగ్గరికి వెళ్లడానికి కూడా ఆనాటి పోలీసులు, సైనిక జవాన్లు సాహసించలేదు. అంతటి నిర్భందంతో కూడా సాయన్న "నా పిక్కలు చీరు రా” "రెక్కలు చీరు రా" "అప్పుడైతే పోతది" "నా ప్రాణం వెంకన్నా" అంటూ రౌద్రంగా అరిచినట్లు అలనాటి ప్రాచీన సాంస్కృతిక పాటల్లో నేటికీ వినిపిస్తున్నది. 125 ఏళ్ల కిందట సాయన్న చేసిన వీరోచిత పోరాట గాధలు, పాటలు నేటికీ పాలమూరు జిల్లాలో వినిపిస్తు న్నాయి. నిజాం నిరంకుశ పాలనలో అమరుడైన తెనుగు సాయన్న సామసోపేత జీవతం సురోని ముదిరాజ్ సామాజిక వర్గం స్ఫూర్తి పొందాల్సి ఉంది.

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post