శ్రీ మహంకాళి దేవాలయం బాపూజీ నగర్, పార్సిగుట్ట, హైదరాబాద్ లో 1974 న వెలసిన సత్యంగల అమ్మవారు. ఈ దేవస్తానం చరిత్ర పరంగా చూస్తే పార్సిగుట్ట (మొరంబొంద) అనబడే ఒక గ్రామం. ఆ ప్రదేశం లో కేవలం చెట్లు మరియు కాలి స్థలం కలిగి వుండేది. అలా ఎన్నో ఎకరాల కలి స్థలంలో కేవలం 4,5 గుడిసెలు మాత్రమే ఉండేవి.
అందులో ఒక గుడిసెలో గుండెబోయిన ముత్యాలు ముదిరాజ్ మరియు గుండెబోయిన సత్యమ్మ ముదిరాజ్ అనే దంపతులు వుండేవారు.వారికీ ఆకరి కుమారుడు గుండెబోయిన నర్సింగ్ రావు ముదిరాజ్ గారు. అతను ఆ ప్రాంతం లో అన్ని విషయాలో చాల చురుకుగా వుండేవారు.అలా అతనికి సుమారు 25 ఏండ్లు వచ్చాక తనకి రోజూ కలలో అమ్మవారు ముఖ్యంగా ఒకే ప్రదేశం లో తిరుగుతునట్లు కల వచ్చేది. దానిని పెద్దగా పట్టించుకోలేదు.
ఒకనాడు తను హోలీ పండుగ రోజు కాముడిని కాల్చేవాడు. అలా కాల్చిన తరువాత తను తన ఇంటికి వెళ్ళడానికి వేరే దారిలో వెళ్తుండగా, అక్కడ ఒక పాము పుట్ట దానిపై రెండు అమ్మవారి ఈరగొలలు,కుంకుమ, పసుపు, బండారు, అమ్మవారి పాదుకలు, అలా అన్ని తనకి కనిపించాయి ఇదే ప్రకారంగా తనకి రోజు కలలో వస్తునది అని గ్రహించిన తను అదే ఆలోచిస్తూ తన ఇంటికి వెళ్ళి పడుకున్నాడు.
కానీ అతనికి నిద్ర పట్టట్లేదు అదే గుర్తుకురాసాగింది. ఆ విషయం మొత్తం వెంటనే తన తల్లి తండ్రులకి తెలిపాడు గుండెబోయిన నర్సింగ్ రావు గారు. ఆ మరుసటి రోజు అమ్మవారు మల్లి అతని కలలో ఎంతో ఆనందం గా నవ్వుతూ సింహం పైన గంభీరంగా తిరుగుతూ వచ్చింది. ఇంకా నర్సింగ్ రావు గారు దానికి అర్ధం గ్రహించి తెల్లవారి జామునే ఆ ప్రదేశం లో మూడు రాళ్ళతో ఒక దిమ్మ ఏర్పాటు చేసి అమ్మవారి దేవాలయం ఏర్పాటు చేసారు. ఆలా ఆ ప్రాంతం భూమి యజమాని తో విషయం చెప్పి కాస్త స్థలం అమ్మవారి గుడి కోసం కేటాయించారు. అ దేవస్థానము నేడు కూడా గుండెబోయిన నర్సింగ్రావు గారి అధ్వర్యంలోనే వున్నది. అతని పుత్రుడే గుండెబోయిన నరేష్ ముదిరాజ్ గారు (ఈ వెబ్ సైట్ ను నడిపించే వారు).
Post a Comment