NELAKONDAPALLY
THIRUMALAAYA PALLEM
ఘనంగా తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
DEMANDS
ముదిరాజులకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలి
ముదిరాజ్ కులాన్ని BC-A జాబితాలో చేర్చాలి.
తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా యూత్ అధ్యక్షులు *కైలాసపు వెంకటేష్ ముదిరాజ్ డిమాండ్.
ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం మరియు తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో పట్టణ అధ్యక్షులు కాశబోయిన మల్లయ్య ముదిరాజ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా యువజన విభాగం అధ్యక్షులు కైలాసపు వెంకటేష్ ముదిరాజ్ పాల్గొని జండా ఆవిష్కరణ చేసినారు. ఈ సందర్భంగా జిల్లా యూత్ అధ్యక్షులు మాట్లాడుతూ తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆవిర్భవించి నేటికి ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఈ సందర్భంగా మాజీ రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీ, మరియు తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బండ ప్రకాష్ ముదిరాజ్ గారి పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ముదిరాజ్ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది అని అన్నారు. ముదిరాజుల కులదైవమైన పెద్దమ్మ తల్లి ఆశీర్వాదాలు ఉండాలని ఆకాంక్షతో పెద్దమ్మ తల్లికి ప్రీతికరమైన పసుపు కుంకుమ రంగులను కలగలుపుతూ ముదిరాజ్ జెండా ఆవిర్భవించింది. కాబట్టి ఈ జెండా ముదిరాజుల అభ్యున్నతికి అభివృద్ధికి నిరంతరం అండగా నిలుస్తుంది అని అన్నారు. ఈ సంఘం ఏర్పాటైన నాటి నుండి ముదిరాజుల సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తూ ముదిరాజుల అభివృద్ధికి పాటుపడుతూ ఉన్నది. ముదిరాజుల అభివృద్ధికి కృషి చేస్తూ ఎన్నో విజయాలు సాధించింది అయినా ఇంకా సాధించాల్సినవి అనేకం ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైనాక ఎన్నో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వచ్చాయి కానీ ముదిరాజుల బీసీ డీ జాబితాలో ఉండటం వలన మాకు రావలసిన ఉద్యోగాలు చాలా కోల్పోయాం. కాబట్టి ముదిరాజుల చిరకాల వాంఛాయన బీసీ-డీ నుండి బీసీ-ఏ జాబితాలోకి మార్చుతూ తెలంగాణ బీసీ కమిషన్ నివేదికను అందించాలి .
అలాగే రాష్ట్ర జనాభాలో 14% ఉన్న ముదిరాజులకు రాజకీయంగా చాలా వెనుకబడి ఉన్నాం.
ఈటెల రాజేందర్ ని మంత్రి వర్గం నుంచి తొలగించిన తర్వాత అప్పటివరకు రాజ్యసభ సభ్యులుగా ఉన్న డాక్టర్ బండ ప్రకాష్ ముదిరాజ్ గారిని రాజీనామా చేయించి ఎమ్మెల్సీ ని చేశారు. కానీ మంత్రివర్గంలో స్థానం కల్పించలేదు. కాబట్టి ఇకనైనా ముదిరాజులకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని డిమాండ్ చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో మండల నాయకులు కైలాసపు వెంకటేశ్వర్లు ముదిరాజ్, పట్టణ సెక్రటరీ మామిడి కృష్ణ ముదిరాజ్, అయితనబోయిన శీను ముదిరాజ్, కాశబోయిన అయోధ్య ముదిరాజ్, శీలం శ్రీను ముదిరాజ్, లింగం నాగేశ్వరరావు ముదిరాజ్, లింగం శ్రీను ముదిరాజ్, మామిడి ఉపేందర్ ముదిరాజ్, కాశబోయిన జానయ్య ముదిరాజ్, కైలాసపు నాగేశ్వరరావు ముదిరాజ్, మామిడి శ్రీను ముదిరాజ్, పిట్టల వెంకన్న ముదిరాజ్, నంద్యాల శివాజీ ముదిరాజ్, తెలగపల్లి ఉపేందర్ ముదిరాజ్, లింగం ఉపేందర్ ముదిరాజ్, అక్కి సైదులు ముదిరాజ్, రేపాకుల సైదులు ముదిరాజ్, తురక వీరభద్రం ముదిరాజ్, పులిగుజ్జు వెంకట్ నర్సు ముదిరాజ్, మామిడి సైదులు ముదిరాజ్ ,లింగం కోటయ్య ముదిరాజ్ ,ఇతనబోయిన వెంకటేశ్వర్లు ముదిరాజ్, గోగుల వీరబాబు ముదిరాజ్ దొండ వీరబాబు ముదిరాజ్ గోగుల నరేష్ ముదిరాజ్ పర్వత కనకయ్య ముదిరాజ్ శీలం శీను ముదిరాజ్ శీలం రాంబాబు ముదిరాజ్ లక్క రామారావు ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
إرسال تعليق