తెలంగాణా ప్రబుత్వం మార్చ్ 24న ముదిరాజ్ భవనానికి కావాల్సిన 5 ఎకరాల భూమి - 5 కోట్ల నిధులు తెలంగాణా ముదిరాజ్ ప్రజలకి మంజూరు చేసారు. ఈ భవనం కోకాపేట్, గండిపేట్ మండల్, రంగారెడ్డి జిల్లా లో జరగనుంది. ఇందుకు ఎంతగానో కృషి చేసిన ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు బండ ప్రకాష్ గారిని మరియు ప్రధాన కార్యదర్శి చొప్పరి శంకర్ గారిని పలువురు ముదిరాజ్ నేతలు జిల్లాల నుండి వచ్చి సన్మానిస్తున్నారు.
కానీ ఈ విషయం పై ముదిరాజ్ విద్యార్ధులు, యువత మరియు నిరుద్యోగులు మాత్రం నిరుత్సాహం గానే ఉన్నారు. పలువురు సోషల్ మీడియా లో భవనానికి సంబంధించి ఎటువంటి ఉపయోగం లేదని విమర్శిస్తునారు మరి కొందరు ఇతర అన్ని కులాలకి 10 ఎకరాల భూమి ,10 కోట్లు పైన ఇచ్చి తెలంగాణా లో అత్యధిక ఓట్లు వున్నా మనకి మాత్రం 5 కోట్లు ఎం సరిపోతాయని వారి అబిప్రాయం తెలిపారు. ఏది ఏమైనా ముదిరాజ్ ప్రజలు ఈ విషయాన్ని అనుకూలంగానే తీసుకోవాలని , ఇటువంటి విజయాలు మారెనో సాధించాలని కోరుత్తునము.
కోకాపేట్ లో ముదిరాజ్ భవన్ కి గవర్నమెంట్ ఇచ్చిన 5 ఎకరాల భూమి, 5 కోట్ల పై మనకి లంబం వుందా లేదా
Created with PollMaker
Post a Comment