ఇతరులకి 10 ఎకరాలు , 10 కోట్ల పైన నిధులు - ముదిరాజులకి 5 ఎకరాలు , 5 కోట్ల నిధులు ! వుప్పరి నారాయణ ముదిరాజ్
యాదవులకు పదెకరాలు పదకొండు కోట్లు, రెడ్లకు పదెకరాలు పదునైదు కోట్లు, బ్రాహ్మలు పదెకరాలు వంద కోట్లు, మనకిట్లెందుకన్నా! ఓట్లే ప్రాతిపదిక అయితే వీరందరికంటె మన ఓట్లే అదికం. పేదరికం ప్రాతిపదిక అవుతే మనమే పేదలం మరెందుకిట్లా? మీరుఒకరుగా సాదించినది మంచిదేనేమో. విశాలప్రాతినిధ్యంతో ఫలితం ఇంకా ఉండేదేమో! మనకంటే ముందు ఎక్కువ ఇచ్ఛండ్రు కాబట్టి వివక్ష్య గా బాధిస్థది.
అసెంబ్లీలో ముఖ్యమంత్రికేసీఆర్స్వయంగా వృత్తిలో మనల్ని ద్వితీయ శ్రేణి లోకి తేవడం ముదిరాజులు, బెస్తలు ఉన్నచోట ముదిరాజుల సభ్యత్వం జటిలమైంది.
మన స్థితి గతు లపై సర్వే చేసి సుప్రీంకోర్టు కు పంపాలి. అది అతీ గతిలేదు. ఈ బీసీ కమీషన్ సర్వే చేస్తే సుప్రీంకోర్టులో నిలవలేదు. కాబట్టి రిటైర్డ్జడ్జి గాని పని చేస్తున్న జడ్జి నేతృత్వంలో గాని సర్వే జరగాలి. ప్రభుత్వ నిశబ్ధం
వివక్సనేకదా! ఇట్లానే వాయిదాలు పడి కేసును సుప్రీంధర్మాసనం కొట్టి వేయ వచ్ఛు. అప్పుడు ఎ లేదు బి లేదు విద్యా ఉద్యోగం అంతే సంగతులు.
ఈ పరిణామాలు మనకు విశాల ప్రాతినిధ్యము అవసరమని సందేశమిస్తున్నాయి.
إرسال تعليق