Process of transferring Mudiraj to BC-A should be taken immediately by the BC Commission - Chilla Sahadev
ముదిరాజులను బిసిఏలోకి మార్చే ప్రక్రియను బీసీ కమిషన్ ద్వారా వెంటనే చేపట్టాలి
-------------------------------------
ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనకబడిన ముదిరాజులను బీసీఏలోకి మార్చే ప్రక్రియను బీసీ కమిషన్ ద్వారా వెంటనే చేపట్టాలని తెలంగాణ ముదిరాజ్ మహాసభ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు చిల్లా సహాదేవ్ ముదిరాజ్ ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆవిర్భావ దినోత్సవం, ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వివేకానంద సెంటర్లో
తెలంగాణ ముదిరాజ్ మహాసభ జెండాను ఆవిష్కరించి అనంతరం పట్టణంలో బైక్ ర్యాలీని అంబేద్కర్ సెంటర్ వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా చిల్లా సహదేవ్ ముదిరాజ్ మాట్లాడుతూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన సూచన మేరకు ప్రభుత్వం ముదిరాజులను బీసీఏ లోకి మార్చే ప్ర క్రియను వేగవంతం చేయాలని ఆయన కోరారు. తెలంగాణ ముదిరాజు మహాసభ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బండా ప్రకాష్ గారి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి, మెప్పించి ముదిరాజులకు అనేక సంక్షేమ ఫలాలు అందించారని అన్నారు. జిల్లాలో సుమారు 3000 మందికి పైగా మోపెడ్లు, ఆటోలు, వలలు అందించడం జరిగిందన్నారు .జిల్లాకు సుమారు నాలుగు కోట్ల చేప పిల్లల పంపిణీ చేసి ప్రభుత్వం మత్యకారులకు అండగా నిలుస్తుందని అన్నారు. అన్ని జిల్లాల్లో ఫిషరీస్ సొసైటీలకు ఎన్నికలు పూర్తిచేసి తెలంగాణ రాష్ట్ర ఫిషరీష్ ఫెడరేషన్కు ఎన్నికలు నిర్వహించాలని కోరారు.
పిదప జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కాటా భాస్కర్ ముదిరాజ్ మాట్లాడుతూ తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బండా ప్రకాష్ గారి కృషి మేరకు జీవో నెంబర్ 4 ద్వారా ముదిరాజులకు మత్యకారులుగా హక్కులు కల్పించడం జరిగిందని అన్నారు .జీవో నెంబర్ 6 ద్వారా ప్రతి ఎకరానికి ఒక సభ్యత్వం తీసుకువచ్చి ముదిరాజులకు సభ్యత్వాల సంఖ్యను పెంచడం జరిగిందన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలో ఉచితంగా చేప పిల్లల అందిస్తూ కేసీఆర్ గారు ముదిరాజులకు అండగా నిలబడ్డారని అన్నారు. 1000 కోట్ల బడ్జెట్ తో ముదిరాజులకు ఫెడరేషన్ ఏర్పాటు చేసి ముదిరాజులను ఆదుకోవాలని ఆయన కోరారు. అనంతరం జిల్లా అధికార ప్రతినిధి ఎ డెల్లి యాకయ్య ముదిరాజ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా మహ'బాద్ జిల్లాలోనే చేపల దోపిడి విపరీతంగా జరుగుతుందన్నారు. మత్యకారులకు కొన్ని గ్రామాల్లో రక్షణ కరువైందనన్నారు. ప్రభుత్వం స్పందించి మత్యసంపద దోపిడీ నివారణకు మత్స్య సంరక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. తెలంగాణ మత్స్య శాఖకు మూడు వేల కోట్ల రూపాయల కేటాయించి వివిధ పథకాల రూపంలో మత్యకారుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు , జిల్లా గ్రంధాలయ సభ్యులు పెద్ది సైదులు ముదిరాజ్,జిల్లా ఉపాధ్యక్షులు రొయ్యల నాగేశ్వరరావుముదిరాజ్, మహబూబాద్ నియోజకవర్గ కన్వీనర్ గుండా వెంకన్న ముదిరాజ్, జిల్లా సాంస్కృత విభాగం కన్వీనర్ పిడుగు వెంకన్న ముదిరాజ్ , మహబూబాబాద్ పట్టణ అధ్యక్షులు జిట్టబోయిన వెంకన్న ముదిరాజ్, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు అప్పనబోయిన విద్యాసాగర్ ముదిరాజ్, మహబూబాబాద్ మత్యపారు శ్రామిక సహకార సంఘం అధ్యక్షులు సింగల్ అశోక్ ముదిరాజ్, ఉపాధ్యక్షులు వద్ది సురేష్ ముదిరాజ్,హనుమంతుని గడ్డ అధ్యక్షులు భూముల నాగరాజు ముదిరాజ్,నడిగడ్డ అధ్యక్షులు గుండెల కృష్ణ ముదిరాజ్,పుచ్చ బాలకృష్ణ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
Post a Comment