తెనుగోలు ముత్రాసి ముదిరాజ్..... ఈ విధంగా వివిధ పేర్లతో పిలవబడుతున్న వీరు తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నారు. మిగతా జిల్లాల్లో వీరు ఉన్నప్పటికీ సంఖ్యాపరంగా తక్కువ మంది. వీరు పూర్వికులు రాజులుగా, సిపారులుగా. కాల గమనంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా వీరి పరిస్థితి కూడా మారింది. కాల గమనంలో చోటుచేసుకున్న మార్పుల కారణంగా వీరి పరిస్థితి కూడా మారింది. ఫలితంగా మత్స్యకారులుగా, కావలికారులుగా, మస్కూరీలుగా వత్తంధారుగా జీవనం సాగిస్తున్నారు. చిన్నచిన్న వ్యాపారాలు చేయటంలోో పట్టణంలో అధిక శాతం ముదిరాజులే ఉంటారు. అయినా సరే వీరికి సిపారుల లక్షణాలు ఇంకా కూడా పోలేదు అని చెప్పుకోవచ్చు.అందుకనే కొన్ని గ్రామాల్లో ఇంకా కూడా వీరు కావలికారులుగానే బ్రతుకుతున్నారు.
ముదిరాజులు ఎక్కువ శాతము మత్స్యకారులుగా కనిపించవచ్చు కానీ ప్రాంతానికి ఒక వృత్తి ఎంచుకున్నారు. వీరిని మహబూబ్ నగర్ జిల్లాలో మాత్రం తెలుగు గంగపుత్రుడుగా పిలుస్తూ ఉంటారు. అలాగే తెలంగాణలో కొన్ని ప్రాంతాలలో ముదిరాజులు ఇప్పటికి కూడా కావలి కారులుగా బ్రతుకుతున్నరు. నల్గొండ జిల్లాలో బంటుగా కూడా పిలవబడుతున్న వీరు కల్లుగీత కార్మికులుగా జీవనం సాగిస్తున్నారు. ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం, ధర్తీ మండలంలో వీరు ఉప్పు తయారు చేసే కార్మికులు గాను జీవిస్తున్నారు. కానీ పట్టణంలో మాత్రం ముదిరాజులు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ దర్శనమిస్తూ ఉంటారు. ఎన్ని విధాలుగా వీరు జీవన పోరాటం సాగించి న దరిద్రపు రేఖ దాటి అడుగు ముందుకు వేయలేకపోతున్నారు ముదిరాజులు. రాష్ట్రవ్యాప్తంగా 30మత్స్యకార కులాలకు చేపలు పట్టుకునే హక్కును కల్పిస్తూ ప్రభుత్వం 19మత్స్యకార కులాలకు చేపలు పట్టుకునే హక్కును కల్పిస్తూ ప్రభుత్వం 1964 జీవో విడుదల చేసింది. ఈ 30 కులాలలో ముత్తురాసి తెనుగు కూడా ఉండడం గమనార్హం . వీటిలో ఎక్కువ కులాలు బీసీఏ గ్రూపులో ఉన్నాయి మరికొన్ని ఎస్టీ జాబితాలో కూడా ఉన్నాయి. బీసీడీలో కేవలం ముదిరాజులు, కాండ్ర కులస్తులు మాత్రమే ఉన్నారు. అందుకోసమే ముదిరాజులు తమని బిసి-ఏలో మార్చాలని కోరడం కూడా ఒక కారణం. వీరి వెనుకబాటు పడడం కూడా మరొక కారణం అని చెప్పుకోవచ్చు. కనుకనే వీరిలో ఇప్పటికీ కనీస కూడు, గుడ్డ, నీడ లేకుండా జీవనం గడుపుతున్న వారు కూడా ఉన్నారు. జనాభాపరంగా కూడా ముదిరాజులు చాలానేే ఉన్నారు కానీ, రాజకీయపరంగా సాముచిత స్థానం సపాదించుకోలేకపోతున్నారు. ఆర్థిక పరిస్థితి, అవిద్య ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అందుకే గతంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి ముఖేష్ గౌడ్ గారు ఇచ్చిన నివేదనలో ముదిరాజులను అత్యంత వెనుకబడిన కులముగా గుర్తించింది.
అయితే ముదిరాజులలో ఎక్కువ మంది చేపలు పట్టి వాటిని అమ్మడమే ప్రధాన వృత్తిగా ఎంచుకున్నారు తెలంగాణ జిల్లాలో 3700 ప్రాథమిక మత్స్యకారుల సంఘాలు ఉన్నాయి. వీటిలో సుమారు 2800 మత్స్యకార సంఘాలు ముదిరాజుల వే కావడం గమనార్హం . అయితే గత కొన్ని సంవత్సరాలుగా వర్షాలు లేని కారణంగా వీరు అప్పుల పాలయ్యారు. ఇప్పుడు చెరువులలో నీరు వచ్చి చేపలు పడుతున్నా గానీ వీరికి అప్పుల బాధ తీరలేదు. వీరిలో చాలామంది ఇప్పటికి వడ్డీ వ్యాపారులపై ఆధారపడి ఉన్నారు. గ్రామాలలో వీరు వ్యాపారం చేసేది పచ్చి సరుకు కావడంతో ఆ పండు కూరగాయలు త్వరగా మార్కెట్ చేరాలి. ఆలస్యం అయితే వాడిపోవడమే, కుళ్ళిపోవడం జరిగి రేటు తగ్గుతుంది కనుక లాభం కోసం చూసుకుంటే అసలుకే మోసం వస్తుంది. దీనికి తోడు రాత్రి సమయంలో వెలుతురు కోసం గ్యాస్ కిరోసినే బ్లాక్ లో కొనుక్కోవాలి. అంతేకాకుండా వీరు ట్రాఫిక్ సమస్య అంటూ అడ్డు తగులుతున్న పోలీసు వాడికి కూడా చేతులు తడపక తప్పదు. ఇలా చుట్టూముడుతున్న అనేక ఆర్థిక ఇబ్బందులకు సమాధానం చెబుతూ కుటుంబం జీవనం సాగించడానికి ఎంతో కొంత మిగిలించుకోవాలి.ఆశించిన విధంగా వ్యాపారం సాగని పక్షంలో చేసిన అప్పు చెల్లించడానికి మరొక వడ్డీ వ్యాపారి దగ్గర ఇదేవిధంగా అప్పు చేయాల్సి వస్తుంది. ఈ విధంగా ఇలా జీవనం వడ్డీ వ్యాపారులపై ఆధారపడి ఉండాల్సి వస్తుంది.
రైతులు పండించిన పంట రైతు బజార్లో అమ్ముకోవడానికి ప్రభుత్వం ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తుందో, అదే విధంగా ముదిరాజులకు కూడా చేపలు అమ్ముకోవడానికి తగిన సదుపాయాలను ప్రభుత్వం కల్పించాలని ముదిరాజ్ పత్రిక ఎడిటర్ ఉప్పరి నారాయణ ముదిరాజ్ గారు గతంలోనే కోరారు. ముదిరాజులు చెమటోడి చేపలు పట్టిన, మధ్యదారుల కారణంగా దోపిడీకి గురవుతున్నారు.
అందుకే అప్పట్లో ముదిరాజుల స్థితి చూసిన వైయస్సార్ ప్రభుత్వం తమను బీసీ-డీ నుండి బీసీ-ఏ గ్రూప్ కి మార్చింధి కానీ ఇప్పటికీ ఈ అంశం కోర్టులో ఉన్న కారణం వల్ల వీరి పోరాటం ఇంకా కూడా ఆగనేలేదుు.
చిన్న చిన్న గ్రామాల్లో ముదిరాజులు ఇప్పటికి కూడా కావలికారులుగా సేవలు చేస్తూ ఉన్నారు.కావున సరిహద్దులో ఉన్న సైనికుడికి ఇచ్చిన పెన్షన్ లాగే ముది రాజులలో ఉన్న కావలిదారులకు కూడా పెన్షన్ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్న.
ఇందుకు కొన్ని అంశాలు దిండి అనే గ్రామంలో ఉన్న ముదిరాజుల ఆవేదన కూడా తెలుసుకుని రాయడం జరిగినది.
ఇట్లు
గుండెబోయిన నరేష్ ముదిరాజ్.
Post a Comment